Polly po-cket
Teluguworld.wap.sh









విడుదల తేదీ : 12 జనవరి 2014
TeluguWorld.wap.sh : 3.25/5
దర్శకుడు : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్..

Yevadu Movie Offical Application


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘మగధీర’. మళ్ళీ మగధీర రేంజ్ లో ఉండబోతున్న సినిమా అని రామ్ చరణ్ చెప్పుకున్న సినిమా ‘ఎవడు’. పలు సమస్యల వల్ల చాలా కాలం విడుదలకి ఆలస్యమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తే, వక్కంతం వంశీ కథ అందించాడు. రామ్ చరణ్ తన కెరీర్లో మెయిలురాయిగా నిలిచిపోతుందనుకుంటున్న ఎవడు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
వైజాగ్ లో నివసించే సత్య(అల్లు అర్జున్), దీప్తి(కాజల్ అగర్వాల్) ఇద్దరూ లవర్స్. పెళ్లి చేసుకోవాలని అనుకునే లోపు వైజాగ్ లో పెద్ద రౌడీ అయిన వీరూ భాయ్(రాహుల్ దేవ్) దీప్తిని చూసి ఇష్టపడతాడు. దాంతో తన మనుషులను పంపి దీప్తిని తీసుకురమ్మంటాడు. అది తెలిసిన సత్య – దీప్తి ఆ రౌడీలకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు కథలో ట్విస్ట్…

అక్కడి నుండి కట్ చేస్తే రామ్ అలియాస్ చరణ్ (రామ్ చరణ్) అదే వైజాగ్ లోని వీరూ భాయ్, అతని గ్యాంగ్ ని చంపడం మొదలు పెడతాడు. ఆ గ్యాంగ్ ని ఫినిష్ చేసేలోపు హైదరాబాద్ లో పెద్ద దాదా అయిన ధర్మ(సాయి కుమార్) మనుషులు చరణ్ ని చంపడానికి ట్రై చేస్తుంటారు. అసలు చరణ్ ఎవడు? ధర్మ చరణ్ ని ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు చరణ్ వీరూ భాయ్ గ్యాంగ్ ని ఎందుకు చంపాడు? అసలు సత్య- దీప్తిల కథలో జరిగిన ట్విస్ట్ ఏంటి? అనే ఆసక్తికరమైన ట్విస్ట్ లను తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సింది,, మొదట్లో వచ్చే అల్లు అర్జున్ ఎపిసోడ్ సినిమాకి ప్రధాన హైలైట్. అలాగే అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఇక చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గురించి.. యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. యాక్షన్ ఎపిసోడ్స్ లో అతను చేసిన స్టంట్స్ మాస్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఫ్రీడం పాటలో రామ్ చరణ్ స్టెప్పులతో కూడా మెప్పించాడు. కాజల్ అగర్వాల్ ది చిన్న పాత్రే అయినా బాగా చేసింది. చరణ్ తల్లి పాత్రలో జయసుధ గారి నటన బాగుంది.

శృతి హాసన్, అమీ జాక్సన్ ల పాత్రలకి ప్రాధాన్యత లేదు. కానీ ఉన్నంత వరకూ గ్లామర్ పరంగా మాత్రం ఇద్దరూ ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకున్నారు. ఇక నెగటివ్ షేడ్స్ ఉన్న ధర్మ పాత్రలో సాయి కుమార్ పెర్ఫార్మన్స్ హీరోకి ధీటుగా పవర్ఫుల్ గా ఉంది. కోట శ్రీనివాసరావు కనిపించేది రెండు మూడు సన్నివేశాలయినప్పటికీ కొన్ని పంచ్ డైలాగ్స్ తో నవ్వు తెప్పిస్తాడు. ఎల్బీ శ్రీ రామ్ ఇలాంటి పాత్రలు ఇది వరకు చేసారు కావున ఎప్పటిలానే ఈ పాత్రని కూడా బాగా చేసారు.

సినిమా మొదటి 15 నిమిషాలు, ఇంటర్వల్ బ్లాక్, ఆ తర్వాత సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే రెయిన్ ఫైట్ మాస్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.

మైనస్ పాయింట్స్ :
సినిమా మొదటి 15 నిమిషాల తర్వాత నుండి చివరి వరకూ ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటారో అలానే జరుగుతుంటుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్నది సినిమా మొదట్లోనే చెప్పేయడం వల్ల ఆ తర్వాత ఊహాజనితంగా సాగుతుంది. సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ ఎక్కువ బోరింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ కథా పరంగా బాగా రొటీన్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు వరకు పోటా పోటీగా సాగే రివెంజ్ డ్రామా క్లైమాక్స్ లో డీలా పడిపోయింది.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు. బ్రహ్మానందం లాంటి కమెడియన్ ని పెట్టుకొని కూడా ప్రేక్షకులని నవ్వించలేకపోవడం ఈ సినిమాకి మరో మైనస్.

సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో మొదటి హైలైట్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్. పాటలు ఓకే, కానీ దేవీశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ప్రాణం పోసిందని అని చెప్పాలి. హీరో మరియు విలన్ ని ఎలివేట్ చేసే సీన్స్ లో, సినిమా కాస్త స్లో అవుతుంది అన్న సమయంలో దేవీశ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్బ్. ఇక రెండవ హైలైట్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేం ని బాగా రిచ్ గా చూపించడంతో విజువల్స్ పరంగా చాలా బాగుంది. పీటర్ హెయిన్, సెల్వ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఓకే. ఎడిటర్ అక్కడక్కడా చిన్న చిన్న కత్తిరింపులు వేసుంటే బాగుండేది.

వక్కంతం వంశీ కథలో ఒకటి రెండు ట్విస్ట్ లు తప్ప మిగతా అంతా రొటీన్ గానే ఉంది. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలకు కథనం చాలా కీలకం ఆ విషయంలో వంశీ పైడిపల్లి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. డైరెక్షన్ పరంగా హీరోని ఎలివేట్ చెయ్యడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు.

తీర్పు :

‘ఎవడు’ సినిమా అందరూ అనుకున్నట్టుగానే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాస్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మన్స్, అల్లు అర్జున్ ఎపిసోడ్, హీరోయిన్స్ గ్లామర్ మరియు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే రొటీన్ గా అనిపించే సెకండాఫ్, ఫస్ట్ హాఫ్ లోని కొన్ని బోరింగ్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం సినిమాకి మైనస్. రెగ్యులర్ ప్రేక్షకులు ఒకసారి చూడదగిన సినిమా అయితే రామ్ చరణ్ అభిమానులకు మాత్రం పండగ చేసుకునే సినిమా అవుతుంది. సంక్రాంతి సీజన్ కావడం వల్ల ఎ సెంటర్స్ లో అటు ఇటుగా ఉన్నా బి,సి సెంటర్స్ లో మాత్రం కలెక్షన్స్ కొల్లగొడుతుంది.

TeluguWorld.wap.sh:-3.25/5




Users Online


9126